Maharastra CM: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకు భద్రతా బలగాలు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పటిష్టం చేశారు. ఇటీవల ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు ఓ రిపోర్టులో వెల్లడించారు. శనివారం సాయంత్రం ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో అంతకు ముందున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను మరింత పెంచారు. ఠాణేలోని సీఎం ఏక్ నాథ్ షిండే తన వ్యక్తి గత నివాసంతో పాటు అధికార నివాసం వర్షకు భారీ భద్రత కలిపించారు అధికారులు. ఏక్ నాథ్ షిండే దసరా రోజైన అక్టోబర్ 5న ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్ లో తన తొలి ర్యాలీలో పాల్గొననున్నారు. దీనికి ముందే బెదిరింపు సమాచారం రావడంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
Read Also: Anti-Hijab Protest: ఇరాన్ హిజాబ్ నిరసనల్లో 90 మందికి పైగా మృతి
ఇదిలా ఉంటే సీఎం ఏక్ నాథ్ షిండే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనంటూ వ్యాఖ్యానించారు. హోం శాఖ, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై తనకు పూర్తినమ్మకం ఉందన్నారు. ప్రజలకు సేవ చేసుకుంటానని వారు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ చెప్పుకొచ్చారు. ఇక భద్రత అనేది అధికారులు చూసుకుంటారన్నారు. ఏది ఏమైనా తన జీవితకాలం ప్రజలకు సేవ చేసేందుకు వెనకాడబోనని చెప్పారు.
Read Also:Prabhas: అఫీషియల్.. రావణ దహనానికి హాజరుకానున్న ప్రభాస్
షిండే వాదనలకు బలం చేకూర్చే లాగ అక్కడ శివసేన కార్యకర్తలు ఉద్దవ్ థాక్రేకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇటీవల వొర్లీలో 3500మంది ఆపార్టీ కార్యకర్తలు షిండే వర్గంలో చేరారు. థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం విశేషం. శివసేన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి జూన్ లో ఏన్ నాథ్ షిండే బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Read Also:IND Vs SA: డేవిడ్ మిల్లర్ సెంచరీ.. అయినా టీమిండియాదే గెలుపు.. సిరీస్ కూడా..!!