Site icon NTV Telugu

YS Jagan: “టీడీపీ” తెలుగు డ్రామా పార్టీ.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

Ys Jagan

Ys Jagan

మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశంలో జగన్ ప్రసంగించారు.

READ MORE: Kamal : కమల్ “తగ్ లైఫ్” బ్యాన్.. కన్నడ సంఘాల ఫైర్.. అసలు ఏంటీ గొడవ?

“టీడీపీ తెలుగు డ్రామా పార్టీ. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవతుంది. కడపలో మహానాడు పెట్టి జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది? సూపర్ సిక్స్, సూపర్ సెవన్‌లు గాలికి వదిలేశారు. 143 హామీలు పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న చిన్న హామీలు కూడా నెరవేర్చలేక పోతున్నారు. ఫ్రీ బస్సు గురించి కడపలో మహిళలు ఎదురు చూస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమై పోయాయి. చదువులు పూర్తిగా పడకెక్కాయి. స్కూలల్లో గోరు ముద్ద నాసిరకంగా మారింది. ఇంగ్లీసు మీడియం పడకేసింది.” అని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: COVID-19: భారత్‌లో కరోనాతో వ్యక్తి మృతి.. వైద్యులు ఏం చెప్పారు?

Exit mobile version