వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ.. 2019లో 23 సీట్లు ఓటు షేర్ కంటే 2024లో. 2.5 శాతం జగన్ కు అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థం అయిపోయింది.. సింగపూర్ లో ఇన్వెస్టర్లకు అర్థమైంది.. చంద్రబాబు భయంతో ఆరోపణలు చేస్తున్నారు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోయిందంటే కారణం చంద్రబాబే..…
Ambati Rambabu: సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం అయినా మాపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందట.. ఇంత వరకు అంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండదు.
మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ లో భాగంగా తొలిఅడుగు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి రోజున ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న మహిళలకు మూడు గ్యాస్ కంపెనీల ద్వారా అందిస్తున్నామన్నారు. అక్టోబర్ 31న డెలివరీ జరిగేలా చూడాలని సీఎం చెప్పారని వెల్లడించారు.