తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని, తెలంగాణ తెచ్చుకున్నాక ఓ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో సమయం అయిపోయిందని, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఒకేరోజు 5 వేల మందికి ఉపాధి దక్కింది. ఉద్యోగాలు పొందిన వారికి…