జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.