Bengaluru: ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరిపై బాలీవుడ్ సింగర్ ఫిర్యాదు
- మరో వివాదంలో ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి
- భూమిని ఆక్రమించారని బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ ఫిర్యాదు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- గతేడాది ఐపీఎస్ ఆఫీసర్‌తో సింధూరికి వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
బెంగళూరు శివారులోని యెలహంక ప్రాంతంలో తన వ్యవసాయ భూమిని ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బంధువు మధుసూదన్ రెడ్డి అక్రమంగా లాక్కొన్నారని లక్కీ అలీ ఆరోపించారు. ఇందుకు కొందరు స్థానిక పోలీసు అధికారులు ఆమెకు సాయం చేసినట్లు తెలిపారు. 2022లోనే దీనిపై తాను కేసు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే తాను లోకాయుక్త పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. గాయకుడి ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ఇది కూడా చదవండి: Goa: “మద్యం తాగుతారు, చెత్త వేస్తారు”..గోవాలో ఫేమస్ బీచ్‌కి వెళ్లాలంటే రిజర్వేషన్ తప్పనిసరి..
ఇదిలా ఉంటే గతేడాది ఐపీఎస్ రూపా మౌద్గిల్‌తో వివాదంతో ఐఏఎస్ రోహిణి సింధూరి వార్తల్లో నిలిచారు. రోహిణి వ్యక్తిగత చిత్రాలను బయటపెడుతూ ఐపీఎస్ రూప చేసిన ఆరోపణలు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రూప ఆరోపణలకు రోహిణి కూడా సోషల్ మీడియాలో దీటుగా స్పందించారు. తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసి, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన రూప తనకు క్షమాపణలు చెప్పాలని.. రూ.కోటి ఇవ్వాలని రోహిణి డిమాండ్ చేశారు. ఈ కేసును విచారిస్తున్న బెంగళూరు కోర్టు మార్చి 24న రూపపై క్రిమినల్ పరువునష్టం కేసును ప్రారంభించింది. అనంతరం కేసును రద్దు చేయాలని మౌద్గిల్ హైకోర్టును కోరింది. ఆగస్టు 21న ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ వ్యవహారం కాస్త తీవ్ర దుమారం రేపడంతో అప్పటి ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంది. వీరిద్దరికీ ఎలాంటి పోస్టులు కేటాయించకుండా బదిలీ వేటు వేసింది.
— Lucky Ali (@luckyali) June 20, 2024
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..