Rayapati Sailaja: అనంతపురం జిల్లా రామగిరిలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ఓ మైనర్ బాలికపై లైంగిక దాడులు జరుగుతున్నాయని విచారకరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా “కాలం బాగోలేదు… అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా అనుమానాలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి” అంటూ ఆమె…
BJP MP: పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా పహల్గామ్ ఉగ్రదాడిపై చేసిన కామెంట్స్‌పై వివాదం చెలరేగింది. ఉగ్రవాద దాడి సమయంలో మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులుగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సిందని ఆయన అనడం రాజకీయ దుమారాన్ని రేపింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(ACJM) రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించినది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ACJMలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన…