ఏదైనా ప్రాంతంలో వజ్రాలు దొరకుతాయంటే ఎవరైనా ఊరికే ఉంటారా?. వెంటనే వజ్రాల కోసం వేట ప్రారంభించేస్తారు కదా. అలాంటి సంఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో భారీగా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాల వేటను ప్రారంభించారు.