అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ యువత ర్యాలీకి దిగింది. అనుమతి లేని కారణంగా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వారు నిరసనకారులు. డిఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ గన్ మ్యాన్ కు గాయాలయ్యాయి. దీంతో లాఠీఛార్జ్ తో చెదరగొట్టారు పోలీసులు. కలెక్టరేట్ ముట్టడికి కోనసీమ జిల్లా మద్దతు దారుల రెడీ అయ్యారు. జై కోనసీమ నినాదాలతో కలెక్టరేట్ వైపు వెళ్తున్న యువతతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడేం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్ డేట్ అందిస్తోంది ఎన్టీవీ.