Liquor Shops: మందుబాబుల ముందు జాగ్రత్త.. వైన్‌షాపుల ముందు క్యూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Shops: ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు బంద్ కాబోతున్నాయి. సుధీర్ఘంగా సాగిన ప్రచారానికి తెరపడబోతోంది. పార్టీలకు మిగిలింది కొన్ని గంటలే. ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరిరోజు అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తించనున్నాయి. సరికొత్త అస్త్రాల్ని బయటకు తీయబోతున్నాయి. క్లైమాక్స్ క్యాంపెయిన్ హీటెక్కిస్తోంది. చివరి గంటల్నే పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయంత్రం నుంచి రెండు రోజులపాటు మందు బంద్ కానుంది. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన మందుబాబులు.. వైన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు.
Read Also: Ponnam Prbhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11న సాయంత్రం ఆరు గంటల నుంచి 13 సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎప్పుడైతే ఈసీ ఆదేశాలిచ్చిందో మందుబాబులు అలర్టయ్యారు. ముందుగానే బాటిల్స్ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు. లిక్కర్ బాటిల్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు. దీంతో వైన్ షాపుల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తు.. ఈ రెండు రోజుల ఇంకోఎత్తు. దీంతో ఆయా పార్టీల నేతలు ఓటర్లపైకి తాయిలాలు వదులుతున్నాయి. కచ్చితంగా తమకే ఓటేస్తారని భావిస్తున్న వర్గాలకు భారీగా మందు పంపిణీకి రంగం సిద్ధం చేశారు.. ముందస్తుగా భారీగా కాటన్లు తెప్పించి స్టోర్ చేశారు. ఓటర్లే కాదు.. తమ వెంటే తిరిగే కార్యకర్తలను సైతం మందులో ఓలలాడించాల్సిందే. లేదంటే వారికీ కోపం వస్తుంది. అందుకే భారీగా కాటన్లు తెప్పించి సిద్ధంగా ఉంచారు నేతలు. ఇంకేముంది తాగినోడికి తాగినంత.. తిన్నోడికి తిన్నంత అన్నట్లుగా మారనుంది పరిస్థితి.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..