తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మాటల యుద్ధం నడుస్తోంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూనే వుంటారు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై నిప్పులు చెరిగారు.
బీజేపీ పాలనలో బొగ్గు కొరత
కరోనా టైంలో ఆక్సిజన్ కొరత
పరిశ్రమలకు కరెంట్ కొరత
యువతకు ఉద్యోగాల కొరత
గ్రామాల్లో ఉపాధి కొరత
రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత
అన్ని సమస్యలకు మూలం PM మోడీకి విజన్ కొరత అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించింది. అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ అధికారులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సమావేశంలో మాట్లాడారు. 7,150 మెగావాట్ల సామర్థ్యం కల్గిన పవర్ ప్లాంట్ల పునరుద్ధరణ దిశగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రాల్లో విద్యుత్తు డిమాండ్, ఒత్తిడి ఎదుర్కొంటున్న పవర్ ప్లాంట్లు, ఒప్పందాలు, బహిరంగ వేలంపై చర్చ జరిగింది.
ఏప్రిల్ నెలలో సాధారణం కంటే 14 శాతం పెరిగింది విద్యుత్ డిమాండ్. మే నెలలో 220 గిగావాట్లకు విద్యుత్తు డిమాండ్ పెరిగే అవకాశం వుందని అంచనా వేశారు. గుజరాత్‌లో 10శాతం, మహారాష్ట్ర 16శాతం, ఉత్తర్‌ప్రదేశ్ 25శాతం, తమిళనాడు 8శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF
— KTR (@KTRTRS) May 2, 2022
Bandi Sanjay: ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ల లెక్క తేలుస్తా