KTR: ఈ సంక్రాంతికి (2025) ప్రభుత్వం ఇంకో మోసం చేయబోతున్నారని, చాలా మంది రైతులకు టోకరా ఇవ్వబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా ఇస్తాం అని ప్రచారం మాత్రమే జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు వాటి కార్యాచరణ లేదని తెలిపారు. కొత్త సంవత్సరం రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉందని గుర్తు చేశారు. సంక్రాంతికి ప్రభుత్వం రైతు రుణమాఫీ పై కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో క్యాడర్ కూడా ప్రశ్నిస్తున్నారని అన్నారు. జనాల్లోకి వెళితే 6 గ్యారెంటీలపై అడుగుతున్నారు అని వారి క్యాడరే చెబుతున్నారన్నారు.
Read also: Movie Producer : రూ.250లు పెట్టి సినిమా టిక్కెట్ కొంటే నిర్మాతకు ఎంత మిగులుతుందో తెలుసా ?
మరోవైపు ఈ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లను ఇచ్చే ఉద్దేశ్యం లేదన్నారు. వాళ్ళ మనిషిని కోర్టుకు పంపి బీసీ రిజర్వేషన్లు ఆపాలని చూస్తున్నారన్నారు. 2024 సంవత్సరం ఢోకా సంవత్సరంగా చేసింది ప్రభుత్వం అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సంవత్సరం ప్రారంభం చేసిన రోజు మాకు ఇబ్బందులతో మొదలైందన్నారు. ఈ సంవత్సరంలో లగచర్ల, హైడ్రా లాంటి కొన్ని అంశాలు మేము ఎత్తుకున్నామన్నారు. ఈ సంవత్సరకాలంగా ఇబ్బందులు ఉన్నా తట్టుకున్నామన్నారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ గా మారిందన్నారు. మాజీ మంత్రి కేసీఆర్ అమెరికా వెళ్తారు అని ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
Read also: Pawan Kalyan: గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన పవన్!
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచం లాగా ఇక్కడ బీజేపీ ఎంపీ లు, కేంద్ర మంత్రులు ఉన్నారని తెలిపారు. అందుకే అమృత్ టెండర్ లపై కేంద్రం నోరు విప్పట్లేదన్నారు. పనికి మాలిన కేస్ లు పెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. అక్రమ కేస్ లు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని అన్నారు. నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. మంత్రి గా నిర్ణయం తీసుకున్నాను అని మొదటి రోజు చెప్పానని ..ఇప్పుడు కూడా అదే మాటకు చెప్తున్నానని తెలిపారు. ప్రొసీజర్ లో తప్పులు ఉంటే ఎన్నికల కమీషన్ ని అడగండి అన్నారు. రేపు కోర్ట్ ముందుకు వస్తుంది.. అందుకే నేను ఎక్కువగా మాట్లాడను అన్నారు. దీనిలో అవినీతి జరగలేదు అని వాళ్లకు కూడా తెలుసని కేటీఆర్ అన్నారు. మొన్న సీఎం చిట్ చాట్ లో కూడా అవినీతి ఎక్కడ జరిగింది అంటే.. చెప్పలేక పోయాడని కేటీఆర్ గుర్తుచేశారు.
Read also: Harish Vs Ponnam: దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు.. సభలో హరీష్‌కు పొన్నం వినతి
మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక సమావేశం పెట్టారు..పీవీ ని కూడా గౌరవించాలన్నారు. పీవీ కి కూడా న్యాయం జరిగే దాకా కొట్లాడతామన్నారు. 2025 సంవత్సరం లో కమిటీ లు ఉంటాయి, సంస్థాగత నిర్మాణం ఉంటుందన్నారు. సభ్యత నమోదు ఉంటుందన్నారు. అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉంటుందని కేటీఆర్ అన్నారు. బహిరంగ సభ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈడీ ద్వారా నోటీస్ వచ్చిందన్నారు. దానిలో ఏమి అనుమానం లేదన్నారు. రేపు కోర్టు లో చెబుతాం.. ఏ కేసులో దూకుడు గా లేని ఈడీ… ఈ కేసులో మాత్రం అత్యుత్సాహం చూపిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. నేను FiR ను సవాల్ చేస్తున్నాను.. కోర్టు ఏమి చెబుతోంది.. కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు కదా అన్నారు.
Rohit Sharma: ఈ ఓటమి మానసికంగా వేధిస్తోంది.. నితీష్ రెడ్డి పోరాటం అద్భుతం..!