Movie Producer : ఇటీవల ఫుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్‍పై బయటకు రావడం… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లతో విషయం మరింత సీరియస్ అయింది. అల్లు అర్జున్ ప్రెస్‍మీట్‍తో మరింత చర్చనీయాంశంగా మారింది. సినిమాలకు బెనెఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమనేలా సీఎం రేవంత్ అన్నారు. టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమనేలా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్రాంతికి రాబోతున్న సినిమాలకు ఇది చాలా ఇబ్బందిగా మారింది. నిజానికి సినిమాలు విడుదల అయినప్పుడు మూవీ కలెక్షన్స్ ని మూడు విధాలుగా లెక్కిస్తారు. అలాగే ఈ కలెక్షన్స్ నెంబర్ కూడా స్టార్ హీరోల సినిమాలకి అదనపు ప్రమోషన్ గా ఉపయోగపడుతుంది. దాంతో పాటు సినిమా రేంజ్ ఇది అని చెప్పడానికి మేకర్స్ వీటిని పోస్టర్లలో ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందుకే సినిమా చూసే ఆడియన్స్ కూడా వాటి కలెక్షన్లు తెలుస్తాయి. అభిమానులు అయితే ఈ కలెక్షన్స్ నంబర్స్ ను ట్విట్టర్ లో హైలైట్ చేస్తూ తమ హీరో రేంజ్ ఇది అంటూ పోస్టులు పెడుతుంటారు. అలాగే హీరోల మార్కెట్ స్టామినాని కూడా నిర్మాతలు ఈ కలెక్షన్స్ నెంబర్ బట్టి లెక్కి్స్తూ ఉంటారనే టాక్ ఉంది. అయితే అసలు సినిమా కలెక్షన్స్ పరంగా మేకర్స్, ట్రేడ్ లెక్కలలో కనిపించే ఈ గ్రాస్, నెట్, షేర్ అంటే ఏంటనేది ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు.
Read Also:AK : హిట్ దర్శకులకు వరుస అవకాశాలు ఇస్తోన్న అజిత్ కుమార్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ వీటి గురించి అందరికీ అర్థం అయ్యే విధంగా చెప్పుకొచ్చారు. అసలు గ్రాస్, నెట్, షేర్ కి తేడా ఏంటనేది యాంకర్ నిర్మాతని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇచ్చారు. థియేటర్స్ లో టికెట్స్ సేల్ ద్వారా వచ్చే కలెక్షన్స్ మొత్తాన్ని గ్రాస్ అంటారు. అందులో ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ పోగా మిగిలింది నెట్ కలెక్షన్లుగా కౌంట్ చేస్తారు. వీటిలో కూడా ఎగ్జిబిటర్లు, థియేటర్స్ పర్సెంటేజ్ కట్ చేయగా ఫైనల్ గా నిర్మాతకి వచ్చేది షేర్ కింద లెక్కగడతారు. ఒక టికెట్ రేట్ 250 ఉంటే దాంట్లో నిర్మాతకి వచ్చేది రూ.100మాత్రమే అని చెప్పారు. మిగిలిన దాంట్లో 18 శాతం వరకు గవర్నమెంట్ ట్యాక్స్ క్రింద కట్ అవుతుంది. మిగిలిన దాంట్లో కొంత మొత్తం సినిమా థియేటర్స్ లో ఆడిన వారాల బట్టి ఎగ్జిబిటర్ల షేర్ పెర్సెంటేజ్ గా పోతుంది. ఈ లెక్కలు చూసుకున్న తర్వాత ఎంత బ్లాక్ బస్టర్ మూవీ అయినా నిర్మాతలకు ఫైనల్ గా వచ్చేది తక్కువగానే ఉంటుందట. కలెక్షన్స్ పై నాగవంశీ ఇచ్చిన ఈ క్లారిటీ పై ట్విట్టర్ లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక బడ్జెట్ పెరగడానికి ముఖ్య కారణం రెమ్యునరేషన్లని ముందుగా తగ్గించుకుంటే నిర్మాతలు సేఫ్ గా బిజినెస్ చేసుకోవచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే రన్ టైమ్ కు తగ్గట్టుగా షూటింగ్ చేస్తే కూడా అనవసర ఖర్చులు ఉండవని చెబుతుంటారు.
Read Also:The Family Man 3 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ షూటింగ్ పూర్తి.. క్లారిటీ ఇచ్చిన మనోజ్