Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ktr Review Meeting With Chevella Brs Leaders Over Parliament Elections

KTR: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి!

Published Date :December 25, 2023 , 1:47 pm
By Sampath Kumar
KTR: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR Review Meeting With Chevella BRS Leaders: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోని మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా.. ముందుకు సాగాలని కేటీఆర్‌ నేతలతో చెప్పారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ సాగింది.

చేవెళ్ల లోక్‌సభ రివ్యూ మీటింగ్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ… ‘లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. నియోజక వర్గాల వారీగా మీటింగ్‌లు ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇంచార్జిలుగా ఉంటారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలి. బీజేపీ ధీటుగా ఉంటది, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వారు కూడా పోటీ ఇస్తారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా ముందుకు సాగాలి’ అని అన్నారు.

Also Read

  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
  • CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..

Also Read: KA Paul: సీఎం రేవంత్‌ రెడ్డితో కేఏ పాల్‌ భేటీ!

చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… ‘నన్ను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యం. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతాము’ అని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • Chevella
  • ktr
  • mp ranjith reddy
  • parliament elections

తాజావార్తలు

  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు

  • Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్‌ప్లే + 7200mAh

  • Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!

  • Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions