నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అంటున్నారు.. బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు.
ఈరోజు భారత రాష్ట్ర సమితి, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది.