ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్.శర్మ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున స్థానిక పార్టీ శ్రేణుల తరలివచ్చారు.
నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అంటున్నారు.. బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు.
మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి అని లేఖలో పేర్కొన్నారు. కొడంగల్ లో రాజ్యం ఆదేశాలతో పోలీసు లాఠీలు నా ఇంటిపై పడి, నన్ను నిర్భంధించి, నడి రాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్ గిరి చలించిందన్నారు. ఆరు నెలలు తిరగక ముందే, కేవలం 14 రోజుల వ్యవధిలో నన్ను…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా.. ఆ సంఖ్య రెట్టింపు కాబోతోంది.. అంటే కొత్తగా 13 జిల్లాలు ఏర్పడి.. మొత్తంగా జిల్లాల సంఖ్య 26కు చేరుకోబోతోంది.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.. 26 జిల్లాల ప్రతిపాదనల నివేదికను సీఎస్‌కు అందజేశారు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్.. ఆ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక,…