KTR: బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని.. 2014 నుంచి పదేళ్లలో హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్ పేటలో BRS అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయన్నారు. గంగా జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు జరగలేదని.. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా జీవించారన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్టమస్ గిఫ్ట్ లు అందించామని తెలిపారు.. కేసీఆర్ ఓ హిందూ.. ఆయన ఎన్నో యాగాలు చేశారు. అయినా ప్రతి మతాన్ని గౌరవించారన్నారు. కొత్త సచివాలయం నిర్మించినప్పుడు అక్కడ ఒక మజీద్, ఒక చర్చి, ఒక దేవాలయం నిర్మించారని చెప్పారు. కేసీఆర్ సెక్యులర్ లీడర్ అనేదానికి ఇది ఒక నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో ఒకసారి ఆలోచించాలన్నారు.
READ MORE: ఇదేందయ్యా.. ఇది.. ఇంటి పేరులేక పోతే.. ప్లైట్ ఎక్కనివ్వరా…
“కాంగ్రెస్ ఏం చేసిందని ఓటేయ్యాలి. ప్రజలు ఆదరించే వ్యక్తిని కొన్ని పార్టీలు ఏదో ఒక సాకుతో అణధరణకు గురి చేస్తారు. బీజేపీతో బీ టీమ్ అని మాపై నిందలు వేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో బుల్డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు. కేంద్రంలో సీబీఐని బీజేపీ తొత్తు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తారు.. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్టును ఎంక్వయిరీ చేయమని సీబీఐకి అప్పగిస్తుంది. వక్ఫ్ బిల్లును మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కోసం జీవో తెచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వక్ఫ్ బిల్లును అమలు చేసేందుకు తొందర పడలేదు. ఇక్కడ ఒక మంత్రిపై ఈడీ దాడులు జరిగి సంవత్సరం అయినా ఎలాంటి చర్యలు లేవు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ రూ. 1350 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ ఒక్క ముస్లిం వ్యక్తికి ప్రాతినిధ్యం లేదు.
ముఖ్యమంత్రి అనుకుంటే ఒక ఎమ్మెల్సీ సీటు ముస్లింలకు కేటాయించి మంత్రి పదవి ఇవ్వచ్చు.. కానీ అలా చేయడం లేదు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
READ MORE: Fake Liquor Case: కల్తీ మద్యం కేసులో దూకుడు పెంచిన సిట్