KTR: బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని.. 2014 నుంచి పదేళ్లలో హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్ పేటలో BRS అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయన్నారు. గంగా జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు…
అల్లు అర్జున్ సినిమా వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ అంశాన్ని ప్రభుత్వం తెర పైకి తెచ్చిందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ పై మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు.. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయనుంది ఎన్టీవీ.. అసలు.. కాంగ్రెస్ ఏడాది పాలనకు కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..? ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా.. అప్పుడే బీఆర్ఎస్‌కి తొందర ఎందుకు?.. అసలు పవర్ లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారా?.. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైపోతుందా?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే లగచర్ల దాడి ప్లాన్ చేశారా?.. కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు తప్పించుకుంటున్నారా?..
KTR Tweet: రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిరోజూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోడీ, అదానీ స్నేహితులంటూ టీ షర్టులు ధరించి నిరసన తెలుపుతున్నారు.
KTR Comments: నాకంటూ ఎలాంటి ఫార్మ్ హౌస్ లేదని కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. నా మిత్రుడి ఫార్మ్ హౌస్ ను నేను లీజుకు తీసుకున్నానని అన్నారు.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు.
KTR: పోలింగ్ కు 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ పాలకులపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
BRS KTR: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి జీహెచ్‌ఎంసీలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
KTR: నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఉదయం 10.30 గంటలకు జరిగే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి యువనేత హాజరవుతారన్నారు.