ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ధూం ధాంగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ కు హాజరై ప్రసంగిస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలు సాధ్యం కాని హామీలనిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులను, రైతులను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణకు ఎప్పటికైనా నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు.
Also Read:Madhya Pradesh: విషపూరిత బావిలో పడిన వ్యాన్.. 10 మంది మృతి..
కేసీఆర్ మాట్లాడుతూ.. వందల మంది త్యాగాలు, పోరాటాలతోనే తెలంగాణ ఉద్యమం సాగింది.. తెలంగాణ ఉద్యమం నుంచి వెనక్కిపోతే.. రాళ్లతో కొట్టి చంపమని చెప్పా.. ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు.. పెదవులు మూశారు.. బీఆర్ఎస్ నేతలు.. పదవులను త్యాగం చేశారు.. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించారు చంద్రబాబు.. ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే.. బలవంతంగా తెలంగాణను ఏపీలో విలీనం చేసింది నెహ్రూనే అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.