Konda Murali: వరంగల్ నగరంలోని వైశ్య భవన్ లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సంఘం నాయకులు తమ డబ్బులను గోల్మాల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటూ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. సభ్యుల ఆహ్వానంతో కార్యక్రమానికి హాజరైన కొండా మురళి సమస్యలను పరిష్కరిస్తానని, అలాగే అనేక విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also:Gang Rape Case: “అంతా ప్లాన్ ప్రకారమే”.. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు..
ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. సంఘంలో డబ్బుల అవకతవకలపై విచారణ జరిపి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ట్రస్టు ద్వారా పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కమిటీ ద్వారా చర్చించి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యాపారులను ఇబ్బంది పెట్టలేదని, కన్యకా పరమేశ్వరి మీద ఒట్టు వేసి చెబుతున్నానని స్పష్టం చేశారు. నాకు ఇంకా 500 ఎకరాల భూమి ఉంది. ఇటీవలే 16 ఎకరాలు అమ్మాను. ఎన్నికలకు పోయినా.. 70 కోట్లు ఖర్చు చేశాను. డబ్బు శాశ్వతం కాదు.. మన తర్వాత తరాలు మన గురించి మంచి చెప్పుకునేలా బ్రతకాలి అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
Read Also:Harish Rao: ప్రభుత్వం బాధ్యత రహితంగా ఉంది.. రూ.కోటి పరిహారం అందించాల్సిందే.
తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్లు వివరించిన కొండా మురళి.. ఉన్నత వర్గాల వ్యక్తులతో పోటీ చేస్తూ ఎక్కడ తగ్గకుండా కొండా సురేఖను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించానని అన్నారు. డిసిసిబి బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు అప్పుల్లో ఉన్న బ్యాంకును లాభాల్లోకి తీసుకొచ్చానని గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండవసారి ఏకగ్రీవంగా గెలిచిన చరిత్ర తనదేనని గర్వంగా పేర్కొన్నారు. రౌడీలు, గుండాల్ని ప్రజలు ఎన్నుకుంటారా..? ప్రజలను ఆదరిస్తూ, కష్టాల్లో భాగస్వామిగా నిలిచి ఉన్నందువల్లే ప్రజలు నన్ను గెలిపించారు. అలాగే కొండా సురేఖను కూడా ఆదరించారు. ఇక ముందు కూడా ఆదరించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తాను ఆర్యవైశ్యుల సమస్యలపై పూర్తి చిత్తశుద్ధితో చర్చించి, అందరికీ న్యాయం జరిగేలా చూడతానని కొండా మురళి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు కొండా మురళికి కృతజ్ఞతలు తెలిపారు.