Kolkata Doctor case: రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్‌కతాకి ఢిల్లీ ప్రత్యేక బృందాలు
- కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై హైకోర్టు కీలక నిర్ణయం
- సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం ప్రకటన
- రంగంలోకి దిగిన సీబీఐ.. కోల్‌కతాకి ఢిల్లీ ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మంగళవారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక వైద్య మరియు ఫోరెన్సిక్ బృందం రానుంది. ఉదయాన్నే బయల్దేరి కోల్‌కతా చేరుకోనుంది. తొలుత ఆర్జీ కర్ ఆస్పత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టనున్నారు.
గత శుక్రవారం ఉదయం డాక్టర్ సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా శవమై పడి ఉంది. ఆమె బట్టలు చిందరవందరగా, ఆమె శరీరమంతా గాయాలయ్యాయి. అయినా కూడా ఆసుపత్రి ప్రతిస్పందనలో తీవ్రమైన లోపాలను కోర్టు గుర్తించింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని కోరడంతో సీబీఐకి అప్పగించింది.
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆధీనంలోని కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై న్యాయస్థానం తీవ్రంగా విరుచుకుపడింది. ప్రిన్సిపాల్ ‘ప్రోయాక్టివ్’ గా లేకపోవడం నిరుత్సాహపరుస్తుందని వ్యాఖ్యానించింది. మాజీ ప్రిన్సిపల్‌కు రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత మరో కళాశాలలో అదే పాత్రను అప్పగించడంపై కోర్టు ధ్వజమెత్తింది. వెంటనే అతనిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపాలని ధర్మాసనం ఆదేశించింది. హత్యాచార ఘటన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన అవమానాన్ని భరించలేనని డాక్టర్ ఘోష్ రాజీనామా చేశారు. కొన్ని గంటల తర్వాత అతనికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కొత్త పోస్టు ఇచ్చారు.
వైద్యురాలు హత్యాచారానికి గురైతే.. కుటుంబ సభ్యులకు ఆత్మహత్యగా ఎందుకు చెప్పారని కోర్టు నిలదీసింది. ఇక ఈ కేసులో ప్రిన్సిపాల్ స్టేట్మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని నిలదీసింది. అతడిని ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించింది. ఇందులో ఏదో తప్పు ఉందని కోర్టు పేర్కొంది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే కేసును ఆదివారంలోపు కొలిక్కి తీసుకురాకపోతే సీబీఐకి అప్పగిస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. మంగళవారం అనూహ్యంగా కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!