తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసులు కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో స్మిత సబర్వాల్ కొనసాగనున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మంగళవారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక వైద్య మరియు ఫోరెన్సిక్ బృందం రానుంది. ఉదయాన్నే బయల్దేరి కోల్‌కతా చేరుకోనుంది. తొలుత ఆర్‌జీ కర్ ఆస్పత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టనున్నారు.
ఆమె ట్రైనింగ్‌లో ఉన్న ఒక ఐఏఎస్. యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 821 ర్యాంక్ సాధించింది. అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఆమె మాత్రం అధికార దర్పం అనుభవించాలని ముచ్చట పడింది
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల్లోగా బదిలీ కావాలని ఈసీ పేర్కొంది. అంతేకాకుండా.. తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న ఈసీ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు.
తెలంగాణలో 133 మంది ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు. అంతేకాకుండా.. 32 మంది ఆర్డీవోలు కూడా బదిలీ అయ్యారు. వారితో పాటు.. డిప్యూటీ కలెక్టర్లు, నయాబ్ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అధికారులు బదిలీలు జరిగాయి. కాగా.. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు జడ్జిల బదిలీలకు సిఫారసు చేసింది. బదలీల్లో 23 మంది హైకోర్టు జడ్జిలు ఉన్నారు. వారిలో గుజరాత్ హైకోర్టు జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఊరుకుంటారా? దాంతో సెల్ఫీనో లేకపోతే రీల్స్ చేయడమో చేస్తుంటారు. అలా చేసిన వాటితో కొందరు పాపులర్ అవుతారు.. మరికొందరు వాటితో చిక్కుల్లో పడతారు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా కె.లావణ్య విధులు నిర్వహిస్తోంది. ఆమెపై కొంతకాలంగా అందులోనే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్.మోహన్‌సింగ్ తనను మానసికంగా వేధిస్తుండటంతో సహించలేకపోయింది. అతని నుంచి తప్పించుకుంటూ వచ్చింది.