Lights Off Protest: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనతో అట్టుడికిపోతుంది. జూనియర్ డాక్టర్ హత్యాచార, హత్య ఘటనపై త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ‘ది బెంగాల్ జూనియర్ డాక్టర్ ఫ్రంట్’ నిరసనలకు పిలుపునివ్వడంతో బుధవారం రాత్రి వైద్యులు రోడ్డెక్కారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మంగళవారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక వైద్య మరియు ఫోరెన్సిక్ బృందం రానుంది. ఉదయాన్నే బయల్దేరి కోల్‌కతా చేరుకోనుంది. తొలుత ఆర్‌జీ కర్ ఆస్పత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టనున్నారు.