Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. రెడ్ రోడ్‌లో జరిగిన ఈద్ ప్రార్థనల కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ.. అల్లర్లకు ఆజ్యం పోసేందుకు రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి.. దయచేసి ఈ ఉచ్చుల్లో పడకండి.. బెంగాల్ ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలుస్తుంది.. రాష్ట్రంలో ఎవరూ కూడా ఉద్రిక్తతలను రేకెత్తించకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి మైనారిటీలతో సమస్యలు ఉంటే.. దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? అని ప్రశ్నించింది. ఇక, తమ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంటే.. బీజేపీ మాత్రం “విభజన రాజకీయాలకు” పునుకుంటుందని దీదీ ఆరోపించారు.
Read Also: RR vs CSK: నేను తెలుగు సినిమాలు చూస్తా.. ‘పుష్ప’ సూపర్: శ్రీలంక బౌలర్
ఇక, బీజేపీ ‘హిందువులను ప్రమాదంలోకి నెట్టి వేస్తుందని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ముస్లింలపై దౌర్జన్యం చేస్తుందన్నారు.. మత రాజకీయాలను తొలగించమని బీజేపీని కోరుతున్నాను.. పశ్చిమ బెంగాల్‌లో విభజనలను సృష్టించడానికి ప్రయత్నిస్తే, మేము దానిని ప్రతిఘటిస్తామని తెలిపారు. మనం ఐక్యతను కాపాడుకోవాలి.. కలిసి జీవించాలని అన్నారు. రాష్ట్రంలో విభజన, మత రాజకీయాలు సృష్టించడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని వెల్లడించారు.