కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గద్కరీతో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేడు ఢిల్లీలోని వారి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులతోపాటు ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టును వేగవంతం చేయాల్సిందిగా కిషన్ రెడ్డి కోరారు.
Also Read : Pakistan: పాకిస్తాన్ మూడు ముక్కలు కానుందా..? బలూచిస్తాన్, ఖైబర్ ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు..
ఈ సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్న వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులతోపాటు ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని నితిన్ గడ్కరీని కోరినట్లు ఆయన వెల్లడించారు. దీంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఇతర జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగిందన్నారు. విజ్ఞప్తికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీచేశారని వెల్లడించారు.
Also Read : Siddaramaiah: ప్రధాని ముందు సీఎం, బీజేపీ నేతలు కుక్కపిల్లలు.. ముందు నిలబడేందుకు వణికిపోతారు..