ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలు గా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసదుద్దీన్ చేతిలో స్టీరింగ్ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపి సస్యశ్యామల తెలంగాణ సాధించాలని, మహిళల అవమానం చేసిన పార్టీ, రజాకార్ల పార్టీ , ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లో పుట్టింది… అలాంటి పార్టీ తో పొత్తు పెట్టుకుంటారు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ కూడా మహిళ వ్యతిరేకి అని, మహిళ మంత్రి లేని ప్రభుత్వం నడిపాడన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపి లు కూడా మహిళ బిల్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారని, తెలంగాణ లో మహిళల ఓట్లు అడుగే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Hi Nanna: న్యాచురల్ స్టార్ ‘నాని’ సినిమా సాంగ్ కి సూపర్ స్టార్ ‘నాని’ సపోర్ట్…
అంతేకాకుండా.. ‘చేసేది బట్టబాజ్ పనులు చెప్పేది శ్రీ రంగ నీతులు. ఏనుగు లు పోతుంటే… సందుల్లో కుక్కలు. థర్డ్ గ్రేడ్ లతకొర్ మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నారు. నీ స్థాయి ఎంత, నీవు ఎంత… మీ లాగా తండ్రులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో కి వచ్చి వందల కోట్లు సంపాదించ లేదు. మా నేతలను, మా జండా ను అంటే ప్రాణాలు అడ్డం పెడతాం… ముస్లిం ఓటర్ లను ఇక్కడ అక్రమంగా చేరుస్తున్నారు… రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ , హైదరబాద్ జిల్లాలు ప్రమాదం లో పడ్డాయి.
Also Read : Shiva Karthikeyan: సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న అయలాన్ టీజర్ వస్తోంది
బీఆర్‌ఎస్ నాయకులు అసద్ దగ్గరికి షూట్ కేసు లు పట్టుకొని పోతున్నారు.. ఎంఐఎంను పోటీ కి పెట్టొద్దని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ లో గెలిచిన వెళ్ళేది బీఆర్‌ఎస్‌లోకే. ఈ దేశం లో సకల సమస్యలకి కారణం కాంగ్రెస్.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవినీతి కుటుంబ పార్టీలు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలన చూసిన ప్రజల్ని మోడీ నాయకత్వం లోని బీజేపీ నీ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మెల్యేలను గెలిపించుకునీ డిసెంబర్ రెండో వారం లో జరిగే అసెంబ్లీ సమావేశానికి రావాలని ఆయన అన్నారు.