సంక్రాంతి సీజన్ లో మన స్టార్ హీరోల సినిమాలని కాదని కోలీవుడ్ నుంచి కూడా డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాయి. అందులో రజినీకాంత్ క్యామియో ప్లే చేస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాతో పాటు కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా ఉంది. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు. సంక్రాంతి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న అయలాన్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ… మేకర్స్ అయలాన్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7:08 నిమిషాలకి అయలాన్ టీజర్ బయటకి రానుంది.
టీజర్ కోసం వెయిట్ చేస్తున్న శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో అయలాన్ ట్యాగ్ ని ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ కి గేమ్ ఛేంజర్ అవుతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. శివ కార్తికేయన్ మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జట్ తో అయలాన్ సినిమాని నిర్మిస్తున్నారు, దీంతో అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది. మరి శివ కార్తికేయన్ ఎంతవరకు ఈ మూవీని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తాడు? పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తాడా లేక సౌత్ కి మాత్రమే పరిమితం అవుతాడా అనేది చూడాలి.
https://twitter.com/24AMSTUDIOS/status/1709865007792689504