బొగ్గు గనుల వేలంపై కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి 2015లో కేటాయించిన 3 కోల్ బ్లాక్ లు సింగరేణి సంస్థ వెనక్కి ఇచ్చేసిందన్నారు. వెనక్కి ఇవ్వడం రూల్స్‌కి విరుద్ధం అయినప్పటికీ కేంద్రం ఎలాంటి పెనాల్టీ వేయలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తిలో దేశం 4వ స్థానంలో ఉన్నామని, బొగ్గు గనులు ఓపెన్ యాక్షన్ ద్వారా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కొన్ని రాష్ర్టాలలో ప్రభుత్వాలు బొగ్గు తీయలేక పోతున్నాయన్నారు. బొగ్గు ఉత్పత్తి పెంచే దిశగా పోటీ తత్వం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, సింగరేణిని…. కల్వకుంట్ల కంపెనీగా మార్చే కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
Also Read : Dr.Vaishali Case Twists: డా.వైశాలి కిడ్నాప్ కేసులో ఎవరి వాదన వారిదే!
సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. సింగరేణిలో 51శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వం దేనని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిది కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు కిషన్ రెడ్డి. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని మోడీ రామగుండం సభలో స్పష్టం చేసారన్నారు. అయితే. గుజరాత్ రాష్ట్రానికి బొగ్గు గనులు అలాట్ చేస్తున్నారని ..గుజరాత్ కు ఓక న్యాయం, తెలంగాణ కు ఓక న్యాయమా అని మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారనే అభద్రతా భావంతో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని ఆయన స్పష్టం చేశారు.