Kishan Reddy : క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి.. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడండి అని 8వ జాతీయ రోజ్ గార్ మేళా లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హాకీంపేట్ CISF, NISA, అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ “రోజ్ గార్ మేళా” లో ముఖ్యఅతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. CISF, CRPF, ITBP, SSB రంగాల్లో మొత్తం 4శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. నేడు జరిగిన 8వ రోజ్‌గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు 5లక్షల 50వేలకు పైగా మంది యువతకు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్‌గార్ మేళాలో భాగంగా ఇవాళ అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మీ తల్లిదండ్రులకు కూడా మన:పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి దేశానికి దిశా నిర్దేశం చేస్తూ.. వెయ్యి-1200 ఏండ్ల క్రితం నుంచే మన దేశంపై దాడులు జరిగాయి. ఎన్నో కుట్రలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారన్నారు.
Also Read : UP Teacher: టీచర్ దెబ్బకి మూతబడిన స్కూల్.. దర్యాప్తు చేస్తున్న అధికారులు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అంతేకాకుండా.. ‘అయినా.. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన కళలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయన్నారు. ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. దేశ సమగ్రత చెక్కుచెదరలేదన్నారు. భారతీయుల్లో ఉన్నటువంటి జాతీయ భావన, యువతలో ఉన్నటువంటి దేశం కోసం, మన గడ్డ సమగ్రతను కాపాడేందుకు ఏదైనా చేయాలన్న సంకల్పమే కారణం. దేశ సేవలో మీరు భాగస్వామ్యులు కాబోతున్నారు. దేశ సమగ్రతను దేశ రక్షణకు మీరు అంకితం కాబోతున్నారు నేటి నుంచి మీరు అంకితభావంతో పని చేస్తూ దేశ సేవలో నిమగ్నమౌతారు ఈ క్రమంలో మీరు ఓ డిసిప్లైన్ మోడ్ లో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ద బడతారు అని నమ్ముతున్నాను. దేశం ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికా తో పాటు గౌరవాన్ని పొందుతున్నాం దానికి ఉదాహరణ మొన్న చంద్రాయన్ పై అడుగు పెట్టడమే అన్నారు. అందుకే మీలాంటి యువతకు సాధికారత కల్పించడం ద్వారా నాటి వైభవాన్ని పున:ప్రతిష్టించుకునేందుకు మోడీజీ సంకల్పించారు. మన దేశానికి.. స్పెషల్ అడ్వాంటేజ్ అయిన యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలనేది మోడీ గారి ఆలోచన.
Also Read : Rahul Gandhi : చిన్నారిని ఆటోగ్రాఫ్ ఇస్తావా అని అడిగిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
ఇందుకోసం అవసరమైన నైపుణ్యాన్ని కల్పించడంతోపాటు వారికి సరైన అవకాశాలు కల్పించడం మోడీ ఆలోచన. దీనికి తగ్గట్లుగానే 9 ఏళ్లుగా.. ఒక్కొక్కటిగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం. వచ్చే 25 ఏళ్ల కాలం ‘అమృత కాలం’. భారతదేశ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో.. మనలోని బానిస ఆలోచనలను తొలగించుకుని కేవలం జాతీయవాద భావనను మదిలో నింపుకుని యువత ముందడుగేయాలి. కేంద్రం యువతకు ఓవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని అందిస్తూ.. ఉద్యోగాలకోసం వేచి చూసే పరిస్థితినుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి యువతను ప్రోత్సహిస్తున్నారు మన ప్రధాని మోడీ. 22 అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారు.
ప్రతి నెల 50నుంచి 70వేల మంది చొప్పున యువతకు అపాయింట్‌మెట్లు అందజేస్తూ ఈ మేళాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇది 8వ రోజ్‌గార్ మేళా, ఇవాళ్టి కార్యక్రమంతో కలుపుకుని మొత్తంగా 5.5 లక్షలకు పైగా మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించాం. మిగిలిన లక్ష్యాన్ని కూడా నిర్దేశిత సమయంలో చేరుకుంటాం. గతంలో ఉద్యోగాలంటే రికమండేషన్ ఉంటేనే వచ్చేది.. కానీ ఇవాళ రికమండేషన్ అవసరం లేకుండా.. టాలెంట్ ఉంటే ఉద్యోగం మీదే అన్నట్లుగా ఉంది పరిస్థితి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అధునాతన సాంకేతికను విద్యావిధానంలోకి తీసుకొచ్చింది. అదే సమయంలో NEP-2020 ద్వారా విద్యావిధానంలో నైతికతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసింది. ఇలా ఈ తొమ్మిదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. వచ్చే 25 ఏళ్ల అమృతకాలంలో.. మీరు మరింత శ్రమించి పనిచేస్తే.. భారతదేశాన్ని మళ్లీ ‘విశ్వగురు’గా పనిచేయడం మరింత సులువు అవుతుంది. ఈ దిశగా మీ సహకారాన్ని ఆశిస్తూ.. మరోసారి మీకు, మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!