Kishan Reddy : ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పోస్టర్‌ను అవిస్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో సానుకూల వాతావరణం ఉందన్నారు. ప్రజలు నరేంద్ర మోడీకి కమలం పువ్వుకే ఓటేసెందుకు ముందే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నామన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు, ఆశీస్సుల కోసం 5 యాత్రలు నిర్వహించాలని …ఫిబ్రవరి 20 నుండి మార్చి ఒకటి వరకు యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 5 పార్లమెంట్ క్లస్టర్ లలో 5 విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్రలకు క్లస్టర్ వారీగా పేర్లు పెట్టినట్లు, భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కి భాగ్యనగరం అని పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. కరీంనగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని, అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని పేరును నిర్ణయించినట్లు వెల్లడించారు.
వీటితో పాటు మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణమ్మ అని, ఖమ్మం, వరంగల్, మహబూబ్ బాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కాకతీయ అని పేర్లను పెట్టారు. ప్రతి రోజు 2, 3 అసెంబ్లీ లని ఒక్కో యాత్ర కవర్ చేస్తుందని, ముఖ్య నేతలు అందరూ అన్ని యాత్రల్లో పాల్గొంటారన్నారు. ఈ యాత్రల సందర్భంగా ఎక్కువ రోడ్ షో లు ఉంటాయన్నారు కిషన్ రెడ్డి. అన్ని యాత్రలు హైదరాబాద్ లో ముగిసే విధంగా ప్లాన్ చేస్తున్నామని, హైదరాబాద్ పార్లమెంట్ లో గెలిచేందుకు పోటీ చేస్తాం… ఎంఐఎంను మట్టి కరిపిస్తామన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ కి కాంగ్రెస్ పోటీ కాదని, తెలంగాణ లో బిజెపికి పోటీ కాంగ్రెస్ అని భావిస్తున్నామన్నారు. ఖమ్మం, నల్గొండ లలో కూడా బీజేపీ కి సానుకూల వాతావరణం ఉందని, కుటుంబ, అవినీతి పార్టీలకి …నీతి కోసం ధర్మం కోసం పని చేస్తున్న బీజేపీ కి మధ్య పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
అంతేకాకుండా.. ‘ఈ ఎన్నికలు దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం. సుస్థిరతకు అస్థిరత కు మధ్య జరుగుతున్న ఎన్నికలు.. రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ, రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ లు ఉన్నాయి.
మేడిగడ్డ కు మేము ఇంతకు ముందే వెళ్లి వచ్చాము. వాళ్లతో వెళ్లాల్సిన అవసరం లేదు. Krmb పై ap, తెలంగాణ కూర్చొని మాట్లాడుకోవాలి. మా స్టాండ్ ఏందో అసెంబ్లీ లో, అసెంబ్లీ బయట చెబుతాం.’ అని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!