ఈ నెల 8 న మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 715 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రధాని మోడీ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.
1,410 కోట్లతో నిర్మించిన మహబూబ్ నగర్, సికింద్రాబాద్ డబ్లింగ్ రైల్వే లైన్ ను ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఎంఎంటీఎస్ విషయంలో గత నాలుగేళ్లలో ఎన్నో సార్లు సీఎం కి లెటర్ లు రాశానని, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది… ఒప్పందం ప్రకారం కట్టుబడి లేదు…. అంచనా వ్యయం భారీగా పెరిగిందన్నారు. రాష్ట్రం సహకరించక పోయిన ఎంఎంటీఎస్ రెండో దశను పూర్తి చేస్తున్నామని, 13 కొత్త ట్రైన్ లు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. బీబీ నగర్ ఏయిమ్స్ లో 1,366 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి ప్రధాని శంఖుస్థాపన చేస్తారని, 7 వేల 866 కోట్లతో జాతీయ రహదారుల పనులకి కూడా pm ఫౌండేషన్ స్టోన్ వేస్తారన్నారు. అంతేకాకుండా.. ‘దేశ వ్యాప్తంగా వంద వందే భారత్ ట్రైన్ లను మోడీ నిర్ణయించుకున్నారు… అన్ని ట్రైన్ లు అయన చేతుల మీదుగానే ప్రారంభం అవుతాయి.
Also Read : CM KCR : ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బీఆర్ అంబేద్కర్
సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ను pm ప్రారంభించనున్నారు. నా విజ్ఞప్తి మేరకే మోడీ ఒప్పుకున్నారు. బెంగళూర్ కు కూడా వందే భారత్ ట్రైన్ నడపాలి అని నిర్ణయం. రీజినల్ రింగ్ రోడ్ కు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా భూ సేకరణ చేస్తే అంత తొందరగా నిర్మాణం ను కేంద్రం చేపడుతుంది.. తెలంగాణ అభివృద్ధి లో RRR గేమ్ చెంజర్ అవుతుంది. 2022..23 లో రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు బడ్చెట్ లో పెట్టిన ఖర్చు చేయలేదు. భూ సేకరణ ఆలస్యం అవుతుంది. రాష్ట్రం తన వాటా నిధులను వెంటనే విడుదల చేయాలి. అంబర్ పేట, ఉప్పల్ ఫ్లై ఓవర్ రోడ్ల పై కొందరు మంత్రులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే వాటి పని ఆలస్యం అవుతుంది.
Also Read : Finland joins NATO: దేశ చరిత్రలో కొత్త శకం.. ఫిన్లాండ్ ప్రధాని సౌలి
సోషల్ మీడియా లో విమర్శించడం ఖర్చు లేని పని. భూ సేకరణ చేయనియకుండ రెచ్చగొట్టారు. స్టీల్ బ్రిడ్జి వెస్తమని చెప్పిన సహకరించడం లేదు.. బాధ్యత రహితంగా మంత్రులు మాట్లాడడం దురదృష్టకరం. తెలంగాణ అభివృద్ధికి సహకటిస్తుంటే.. ఎంఎంటీఎస్ కి సహకరించరు… Rrr పట్టించుకోరు, సైన్స్ సిటీ, మ్యూజియం , నాటక అకాడమీ బ్రాంచ్ కానీ, చెర్లపల్లి టెర్మినల్ కానీ ఆలస్యం కావడానికి ఆగి పోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు మీరు ఉంటారు… అధికారం ముందు పోతారు. రాజకీయాలు లక్ష్యంగా పెట్టుకున్నారు అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకోలేదు. ఇక మీరు ఉండేది 6 నెలలు మాత్రమే … ఈ 6 నెలలు అయిన సహకరించండి.’ అని ఆయన అన్నారు.