Killer Wolf: డ్రోన్ కెమెరాకు చిక్కిన 10 మందిని చంపిన కిల్లర్ తోడేలు..
- యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కొనసాగుతున్న కిల్లర్ తోడేళ్ల భయం
- 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం
- ఐదు తోడేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు
- తాజాాగా డ్రోన్ కెమెరాకు చిక్కిన మరో తోడేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కిల్లర్ తోడేళ్ల భయం కొనసాగుతోంది. మహసీలోని ఘఘ్రా బేసిన్‌తో సహా వివిధ 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ శాఖ డ్రోన్ కెమెరాలో బంధించిన ఆరు తోడేళ్లలో ఐదు అధికారులు పట్టుకోగా.. ఒక తోడేలు మాత్రం అటవీశాఖకు సవాలుగా మారింది. సెప్టెంబరు 16న కోలెల గ్రామంలో మేకను వేటాడిన తోడేలు.. ఆ తర్వాత ఆచూకీ లభించలేదు. 10 రోజుల పాటు సైలెంట్ మోడ్‌లో ఉండి 10 మందిని చంపిన హంతక తోడేలు బుధవారం సాయంత్రం అటవీ శాఖ డ్రోన్ కెమెరాకు చిక్కింది.
Read Also: Student Died: నీళ్లు తాగేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లిన విద్యార్థి మృతి.. కారణమిదే..?
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
మహాసి ప్రాంతంలో నెత్తుటి ఆటలు ఆడుతున్న ఐదు క్రూరమైన తోడేళ్లను సీసయ్య చూడామణి గ్రామంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆరవ తోడేలు కోసం ఆ శాఖ బృందాలు సీసయ్య మరియు ఘఘ్రా బేసిన్‌తో సహా అనేక సమీప గ్రామాలలో వెతుకుతున్నారు. సెప్టెంబర్ 16న కోలెలకు చెందిన రామ్ కిషన్ మేకను ఎత్తుకెళ్లి ఎమ్మెల్యే సురేశ్వర్ సింగ్ ఇంటి ముందు ఉన్న చెరుకు తోటలోకి వెళ్లిపోయిందని డీఎఫ్‌వో అజిత్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
Read Also: Himachal Pradesh: హిమాచల్ సర్కార్ యూటర్న్.. నేమ్ బోర్డు డిస్‌ప్లే ఉత్తర్వు విత్‌డ్రా
ఈ క్రమంలో.. ఎమ్మెల్యేతో పాటు అటవీ సిబ్బంది బృందాలు, గ్రామస్తులంతా చుట్టుముట్టి ఉచ్చు బిగించినా తోడేలు తప్పించుకుంది. అప్పటి నుండి అదెక్కడుందో గుర్తించలేదు. బుధవారం ఈ డ్రోన్ సీసయ్య చూడామణి నుంచి చహలారి వైపు వెళ్తున్న కెమెరాలో తోడేలు కనిపించింది. ఈ క్రమంలో.. దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బహ్రైచ్‌లోని మహసీ తహసీల్‌లో గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల భయం ఉంది. నరమాంస భక్షక తోడేళ్ల సమూహం ఇప్పటివరకు 9 మంది పిల్లలతో సహా 10 మందిని చంపి తినేసింది. అలాగే.. దాని దాడిలో 60 మందికి పైగా గాయపడ్డారు.
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!