యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కిల్లర్ తోడేళ్ల భయం కొనసాగుతోంది. మహసీలోని ఘఘ్రా బేసిన్‌తో సహా వివిధ 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ శాఖ డ్రోన్ కెమెరాలో బంధించిన ఆరు తోడేళ్లలో ఐదు అధికారులు పట్టుకోగా.. ఒక తోడేలు మాత్రం అటవీశాఖకు సవాలుగా మారింది.