Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor: బాలీవుడ్లో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న జాన్వీ కపూర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటివరకు వెండితెరపైనే ఎక్కువగా కనిపించిన ఈ యంగ్ బ్యూటీ, త్వరలో తమిళ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమౌతోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ నిర్మాణంలో, సర్గుణం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక రా అండ్ ఇంటెన్స్ సోషల్ వెబ్ సిరీస్ గా తెరకెక్కుతోంది ఈ సిరీస్. దీని ద్వారా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీదేవి కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘దేవర’, ‘పెద్ది’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ఇప్పుడు తమిళ డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఈ క్రేజీ తమిళ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ‘కురత్తి’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే టైటిల్‌తో పాటు కథ, పాత్రల వివరాలను ఇంకా ఆఫీషియల్ గా వెల్లడించాల్సి ఉంది. పా.రంజిత్ తన సినిమాల్లో సోషల్ మెసేజ్ ను చూపించడంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పర్యవేక్షణలో సర్గుణం దర్శకత్వం, జాన్వీ కపూర్ లీడ్ రోల్ కలిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా జాన్వీ తన గత చిత్రాలతో పోలిస్తే మరింత ఇంటెన్స్, డిఫరెంట్ పాత్రలో కనిపించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ‘కురత్తి’ (Kurathi) అనేది సమాజంలోని వివక్ష, అణగారిన వర్గాల హక్కుల కోసం ఒక సామాన్య మహిళ చేసే పోరాటంతో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో జాన్వీ కపూర్ తన రెగ్యులర్ గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా, నటనకు ఎంతో ప్రాధాన్యమున్న ఒక బలమైన గ్రామీణ మహిళగా డిగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఇప్పుడు ఓటీటీ ఆదరణ పెరగడంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా డిజిటల్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాగ చైతన్య, సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఇప్పటికే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కూడా ఓటీటీలోకి అడుగుపెడితే దక్షిణాది డిజిటల్ కంటెంట్‌లో ఇది ఆసక్తికరమైన కాస్టింగ్‌గా నిలిచే అవకాశం ఉంది. అయితే ‘కురత్తి’ వివరాలపై ప్రస్తుతం ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. త్వరలో మేకర్స్ నుంచి ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్, నార్త్ సినీ పరిశ్రమలలో వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. శ్రీలీలతో కలిసి ఒక క్రేజీ సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్‌లో నటిస్తుండగా, బాలీవుడ్లో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తున్న యాక్షన్ రివెంజ్ డ్రామా ‘లగ్ జా గలే’ 2027 మేలో విడుదల కానుంది. ఇప్పుడు పా. రంజిత్ నిర్మాణంలో వస్తున్న ‘కురత్తి’ వెబ్ సిరీస్ ద్వారా ఆమె డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
- Tags
- cinema
- Janhvi Kapoor
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు