యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కిల్లర్ తోడేళ్ల భయం కొనసాగుతోంది. మహసీలోని ఘఘ్రా బేసిన్‌తో సహా వివిధ 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ శాఖ డ్రోన్ కెమెరాలో బంధించిన ఆరు తోడేళ్లలో ఐదు అధికారులు పట్టుకోగా.. ఒక తోడేలు మాత్రం అటవీశాఖకు సవాలుగా మారింది.
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది.
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
నైరుతు రుతుపవనాలు ప్రారంభం అయినప్పటి నుంచీ హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు వరదల నుంచి కోలుకోలేదు.
ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాల కేసులో ఎన్ఐఏ ఎదుట విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే.. పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తోందనే అభియోగాలతో నిన్న (ఆదివారం) ఎన్ఐఏ విస్తృత దాడులు నిర్వహించింది. ఈనేపథ్యంలో.. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం,…