Site icon NTV Telugu

Kidney Racket: కిడ్నీ రాకెట్ మాఫియాలో విస్తుపోయే అంశాలు.. భారత్‌లో కిడ్నీ దందా నడిపిన శ్రీలంక వాసి..!

Kidney Racket

Kidney Racket

కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్​నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా… మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది. శ్రీలంకలో ఓవైపు కేసినో నిర్వహిస్తూనే, మరోవైపు భారత్‌లో కిడ్నీ దందా నిర్వహిస్తున్నాడు.

READ MORE: Kishan Reddy: కవిత ఎపిసోడ్‌పై స్పందించొద్దు.. బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి కీలక సూచనలు..!

తమిళనాడులో కొందరు ఏజెంట్లను నియమించుకుని ఆర్థిక ఇబ్బందులున్న వాళ్లే టార్గెట్ చేశాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి గ్రహీతల నుంచి రూ 50-60 లక్షలు వసూలు చేశారు. దాతలకు రూ.5 లక్షలు, ఆపరేషన్ చేసిన వైద్యులకు రూపాయలు 10 లక్షలు ఇచ్చారు. శ్రీలంక, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరులో దందా సాగించారు. తమిళనాడు , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , కేరళ , తెలంగాణలో లింకులపై సీఐడీ ఆరా తీస్తోంది. మోస్ట్ వాంటెడ్ పవన్ పై ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.

READ MORE: Kishan Reddy: కవిత ఎపిసోడ్‌పై స్పందించొద్దు.. బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి కీలక సూచనలు..!

Exit mobile version