కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
MK Stalin: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. అవయవ దానం చేసిన దాతలకు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.