Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు.
కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది. పిడియాక్ట్రిషన్ అంటూ ఆసుపత్రిలో వైద్యం నిర్వహించాడు నకిలీ డాక్టర్.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. మియాపూర్ లోని ఓ హాస్పిటల్‌లో డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ అంశాన్ని మియాపూర్ పోలీసులు నెల రోజులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వద్దని హాస్పిటల్…
Unethical: లైంగికదాడికి యత్నించిన పెంపుడు తండ్రిపై కూతురు దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో సంచలనంగా మారింది. కండ్ల కోయలోని మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తు ఓ వ్యక్తి వరసకు కూతురైన మైనర్ బాలికపై కన్నువేశాడు.