పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మహిళలు ఊరుకో అక్కా అంటూ ఓదార్చారు. ఇంతకీ ఈ యువ ఎమ్మెల్యేకి ఏం కష్టమొచ్చింది. కన్నీరు పెట్టడానికి గల కారణం ఏమయ్యుంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో యశస్విని రెడ్డి పాల్గొన్నది. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది. Also…
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు వరంగా మారింది. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందరిమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని తనకు పట్టిస్తే పార్టీ నుంచి…
మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను అభినందిస్తున్నానన్నారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది.. ధాన్యం కొనుగోలు…