Tantra Movie: పిల్లబచ్చాలు రావోద్దు.. ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల ‘తంత్ర’ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananya Nagalla’s Tantra Movie Release on March 15: మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ‘అనన్య నాగళ్ల’. ఇప్పటివరకు గ్లామర్ క్యారెక్టర్స్ చేసిన అనన్య.. హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘తంత్ర’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్‌పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే తంత్ర నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది.
తంత్ర సినిమా మార్చి 15న రిలీజ్ అవనుంది. ఈ విషయాన్ని మేకర్స్ సరికొత్తగా ప్రకటించారు. ‘మా సినిమాకి పిల్లబచ్చాలు రావోద్దు. ఎందుకంటే మాది ‘A’ సర్టిఫికెట్ సినిమా’ అని చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేసింది. తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్.. సినిమాకి చిన్నపిల్లలు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా సినిమాలో కనిపించనున్నారు.
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
Also Read: IND vs ENG: నిప్పులు చెరిగిన ఆకాశ్ దీప్.. ఐదు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్!
అనన్య నాగళ్లకి జోడీగా దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి నటిస్తున్నాడు. మర్యాదరామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ఈ హార్డ్‌హిట్టింగ్ హర్రర్ డ్రామాలో కీలక పాత్రలు చేస్తున్నారు. మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన దర్శకుడు వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి.. సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని ‘తంత్ర’తో సాధించాడు.
#Tantra Releasing On March 15 pic.twitter.com/5GvpTXd4Yk
— Vamsi Kaka (@vamsikaka) February 23, 2024
తాజావార్తలు
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!