ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే.. తాజాగా ఒక ప్యాసింజర్ ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించి అరెస్ట్ పాలయ్యాడు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Swami Paripoornananda: ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు..వైసీపీకి 123 సీట్లు ఖాయం!
కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. క్యాబిన్ సిబ్బందిపై దాడి చేసి.. అనంతరం విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. భద్రతాపరమైన ముప్పు ఉందన్న భయంతో పైలట్ ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. అనంతరం కేరళకు చెందిన ప్యాసింజర్‌ను అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల యవకుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక అధికారి సోమవారం తెలిపారు. శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత నిందితుడు అబ్దుల్ ముసావిర్ నడుకండీని అరెస్టు చేసినట్లు సహర్ పోలీసు అధికారి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mexico: మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్‌బామ్