ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి.. అధికార వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేందుకు కృషిచేస్తున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరించారు.
ప్రగతి – పారదర్శకత – సుస్థిరత – జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రిగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గత ఆరున్నర నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాహారం అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఓ వరుస ట్వీట్స్ చేసింది.
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, ఆడపడుచులకు, మిత్రులకు, వ్యాపార వేత్తలకు, ఉద్యోగులకు, వివిధ రంగాల ప్రముఖులకు, కార్మిక, కర్షక వర్గాలకు నా రైతు సోదరులకు, భావితరం భవిష్యత్తు విధ్యార్ధులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ముఖ్యంగా నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరి జీవితాలు సంతోషంతో నిండాలని, ఆరోగ్యంతో ఉండాలని, ఆర్ధికంగా, వృత్తి, వ్యాపార రంగాలలో విజయం సాదించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వం తరపున ఆకాంక్షిస్తున్నాను. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీ అమలుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశ, దిశా మార్చే విధంగా అన్ని రంగాలలో ముందుకెళ్తూ, సంక్షేమాభివృద్ది సాదించేందుకు.. ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తామని మాట ఇస్తున్నాము. అదే సందర్భంలో ప్రజలందరూ కూడా మీ మీ ప్రాధమిక భాధ్యతలు సక్రమంగా నిర్వహించి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రగా తీర్చి దిద్దడంలో ప్రధాని గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ భారత్ కలను సాకారం చేయడంలో భాగం కావాలని, తద్వారా దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలచి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాదించడంతో పాటుగా, పర్యాటకులను ఆకర్షించి టూరిజం అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిస్తున్నాను.
గత సంవత్సరం ఎన్నికల్లో ఎన్డీయే కూటమిపై మీరు చూపించిన ప్రేమ మరువలేనిది. గత సంవత్సరం దశాబ్ద పోరాటానికి ఫలితంగా మీరు చూపించిన ప్రేమ, ఎన్డీయే కూటమికి అందించిన చారిత్రాత్మక విజయం మరువలేనిది. అన్ని వర్గాలు ఏకమై ఒక్క గొంతుగా మారి రాష్ట్ర భవిష్యత్తు కొరకు, వ్యవస్థ ప్రక్షాళన కోసం పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన విధానం నా గుండెలకు హత్తుకుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా పూజలు ఎన్నుకుంటే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది. గ్రామీణ నీటి సరఫరా.. పర్యావరణ, అటవీ. సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా మీ ప్రేమ నాకు భాద్యతలు తెచ్చి పెట్టింది. భాధ్యతలు చేపట్టిన నాటి నుండి త్రికరణ శుద్దిగా నా కర్తవ్యాలు నిర్వహిస్తున్న సమయంలో ఎన్డీయే ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగి గత ఆరున్నర నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ది పనుల వివరాలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న పలు నిర్ణయాలు మీకు తెలియజేయడం నా బాధ్యతగా బావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీ ప్రేమ, మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటూ..
మీ
పవన్ కళ్యాణ్.
సమగ్ర అభివృద్ధి నివేదిక – 2024
ప్రగతి – పారదర్శకత – సుస్థిరత – జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పిఠాపురం MLA గా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రిగా… pic.twitter.com/yptPF9ghhx
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 1, 2025