Sureshbabu : సంచలన నిర్ణయం తీసుకోబోతున్న నిర్మాత సురేష్ బాబు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమ లో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న వారిలో దగ్గుపాటి సురేష్ కూడా ఒకడు. మూవీ మొఘల్ రామానాయుడు కొడుకు గా వెంకటేష్ లాగ సినీ నటుడు కాకుండా, నిర్మాతగానే కెరీర్ ని సాగిస్తూ వచ్చాడు.అయితే అప్పట్లో రామానాయుడు డేరింగ్ డాషింగ్ నిర్మాత. ఆ రోజుల్లో ఆయన ఎన్టీఆర్ మరియు నాగేశ్వర రావు వంటి వారితో భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్నాడు. అలాగే భారీ బడ్జెట్ తో తీసి ఫ్లాప్ అయ్యినవి కూడా ఆయన కెరీర్ లో చాలానే ఉన్నాయి. హిట్ వచ్చినప్పుడు ఆయన పొంగిపోలేదు, అలాగే ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కృంగిపోలేదు. డబ్బులు ఆయన ఆరోజుల్లో జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు.కానీ సురేష్ బాబు అందుకు పూర్తి గా విరుద్ధం అని చెప్పాలి.. ఎలాంటి రిస్క్ పెట్టుకోకుండా తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసేసి థియేటర్స్ లో విడుదల చేస్తుంటాడు.
ఒకవేళ సినిమా ఆడదు అని అనిపిస్తే కనుక థియేటర్స్ లో విడుదల చెయ్యకుండా ఓటీటీ లోనే నేరుగా విడుదల చేసేస్తాడు. ఆయన పెట్టిన ప్రతీ పైసా కి కూడా పది రూపాయిలు లాభం వస్తుంది అంటేనే ఏ పని అయినా కూడా చేస్తాడు. ఒకవేళ నష్టం వస్తుంది అందులో రిస్క్ ఉంది అని అనిపిస్తే కనుక అటు వైపు అస్సలు చూడడు. అలాంటిది తన రెండవ కొడుకు అభిరామ్ ని హీరో గా పరిచయం చేస్తూ , లేటెస్ట్ గానే ‘అహింస’ అనే సినిమాని విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించాడు. టీజర్ మరియు ట్రైలర్ విషయంలోనే ఎంతో నాసిరకం గా అనిపించిన ఈ సినిమా కి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదని చెప్పాలి.. ఫలితంగా లీడర్ వంటి సినిమాతో తన అన్నయ్య లాగానే, అభిరామ్ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెడతాడు అనుకుంటే, కనీసం గ్రాస్ వసూళ్లను కూడా అహింస రాబట్టలేకపోయింది. ఈ సినిమాకి సురేష్ బాబు దాదాపుగా 15 కోట్ల రూపాయిలు బడ్జెట్ ని ఖర్చు చేసాడని తెలుస్తుంది.. తాను నిర్మించే సినిమాలకు 5 కోట్ల బడ్జెట్ కి మించి ఖర్చు చెయ్యని సురేష్ బాబు ఏకంగా 15 కోట్లు ఈ సినిమాకి ఖర్చు చేసాడు. కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాకపోవడం తో ఈ చిత్రానికి పెట్టిన డబ్బులు పోయి పూర్తిగా నష్టం వచ్చింది.అందుకే కొంతకాలం వరకు సినిమాలకు దూరం ఉండడమే మంచిది అని అనుకుంటున్నట్లు ఆయన సినిమాలకు దూరం అవ్వబోతున్నట్లు ఇన్సైడ్ నుంచి టాక్ వచ్చింది.
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!