ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు 11 రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా.. కగార్ అనే ఆపరేషన్తో ఛత్తీస్ఘడ్లో యువకులను ఊచకోత కోస్తున్నారు.. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయండి.. మావోయిస్టులతో చర్చలు జరపండని కోరారు.
Also Read: KCR: కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారా.. ఇది సాధ్యమా..?
కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటున్నారు.. పిల్లలు అడిగితేనే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు.. కత్తి ఎవరి చేతిలోనో పెట్టి.. నన్ను యుద్ధం చేయమంటే ఎలా.. తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు.. నా కళ్ల ముందు.. తెలంగాణ పరిస్థితి ఇలా అవుతుంటే, బాధ కలుగుతుంది.. హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. మరో రెండున్నరేళ్లలో ఇక ఏమీ చేయగలుగుతారు.. మాట్లాడితే బీఆర్ఎస్ ను బద్నామ్ చేస్తున్నారు.. హెచ్సీయూ యూనివర్సిటీ భూములను ఎవరైనా అమ్ముతారా.. భూములను అమ్మవచ్చు.. అయితే ఏ భూములను అమ్మాలనే విచక్షణ ఉండాలి కదా అని కేసీఆర్ వెల్లడించారు.