Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jagtial Kcr Jagtial Speech Scrapping Hydraa Congress Criticism

KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే

Published Date :April 20, 2026 , 9:30 pm
By Gogikar Sai Krishna
  • ఆశపడితే మోసం చేశారు
  • బీఆర్ఎస్ కేవలం 1.7శాతం తేడాతో ఓడింది...
  • రియల్ ఎస్టేట్ పడిపోయింది
  • రైతులకి ఇస్తామన్న బోనస్ బోగస్ అయింది : కేసీఆర్
KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్నీ కోల్పోయామని బాధపడుతున్నారని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జగిత్యాల బహిరంగ సభలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.7 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. “కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏదైనా చేస్తారని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. కానీ, వీళ్లు ఒక్కటంటే ఒక్కటైనా నిర్మాణాత్మకమైన పని చేశారా?” అని ప్రశ్నించారు. ప్రజలు ఆశపడి ఓటేస్తే, కాంగ్రెస్ వారిని నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.

Supreme Court: ఉచిత పథకాలపై కేసు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు..

Also Read

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
  • Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో
  • IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

రైతుల పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా మారిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “దుకాణాల్లో యూరియా లేదు కానీ యాప్‌లో వస్తుందట. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెడుతున్నారు. రైతుబంధు రావాలంటే కేసీఆర్ సభ పెట్టాలా? రైతులకు ఇస్తామన్న బోనస్ కాస్త ‘బోగస్’ అయింది. మొక్కజొన్న కొనుగోలు చేసే దిక్కు లేదు” అని ధ్వజమెత్తారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సంతకాలు చేసిందని ఆయన ఆరోపించారు.

హైడ్రా (HYDRAA) పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న తీరుపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. “ఏమిటి ఈ కూల్చివేతలు? కనీసం పిల్లల పుస్తకాలు కూడా తీసుకోవనివ్వరా? మేము అధికారంలోకి రాగానే మొట్టమొదట హైడ్రాను పీకి పారేసే ఫైలు మీదనే సంతకం చేస్తాను” అని హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ పోయి ‘నిడ్రా’ తెస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. “మేము ఉద్యోగులకు 72 శాతం పీఆర్సీ ఇచ్చాము, కానీ వీళ్లు 7 శాతం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు 12 వేల కోట్లకు చేరాయి. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ పోయించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు” అని విమర్శించారు.తెలంగాణ సమాజం ఇప్పుడు ఒక గందరగోళంలో ఉందని, ప్రజల పక్షాన నిలబడి ఈ ‘దరిద్రపు పాలన’పై పోరాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Party
  • fee reimbursement.
  • HYDRAA
  • Jagtial Public Meeting
  • kcr

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions