Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss Mistakes: ఈరోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్య అతిగా బరుకు పెరగడం. ఈ పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం చాలామంది విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా బరువు తగ్గాలనే ఆత్రుతతో భోజనం మానేస్తుంటారు. అయితే ఈ పద్ధతి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నిజానికి బరువు పెరగడం అనేది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది అనేక అనారోగ్యాలకు మూలం. అందుకే జిమ్‌లు, డైటింగ్ వంటి పద్ధతుల ద్వారా బరువు తగ్గాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. అయితే బరువు తగ్గడం అంటే ఆహారం మానేయడం అని చాలా మంది పొరపడుతుంటారు. ఈ అపోహపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వివరణ ఇచ్చింది.
ఆహారం మానేయడం ఎందుకు ప్రమాదకరం..
WHO నివేదిక ప్రకారం.. భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతామనుకోవడం ఒక భ్రమ. ఒక పూట భోజనం మానేయడం వల్ల ఆకలి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల తర్వాతి పూట మనకు తెలియకుండానే అతిగా తినేస్తాం. ఫలితంగా కేలరీల వినియోగం పెరిగి బరువు తగ్గడానికి బదులు మరింత పెరుగుతారు. భోజనం మానేయడం ద్వారా బరువు తగ్గినా, అది దీర్ఘకాలంలో ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం మానేయడం వల్ల శరీరంలో పలు మార్పులు వస్తాయి. అవి ఏంటంటే.. శరీరానికి అవసరమైన ఆహారం అందకపోవడంతో రోజంతా నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయి ‘హైపోగ్లైసీమియా’కు దారితీస్తుంది. దీనివల్ల తల తిరగడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకపోతే శరీర జీవక్రియ మందగిస్తుంది.
Also Read
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ఆరోగ్యకరంగా బరువు తగ్గడం ఎలా అంటే..
స్థిరమైన బరువును కాపాడుకోవడానికి WHO కొన్ని సూచనలు చేసింది. అవి ఏంటంటే.. భోజనం మానేయడం కంటే, తక్కువ పరిమాణంలో పోషక విలువలున్న ఆహారాన్ని తరచుగా తీసుకోవడం మంచిది. నిర్ణీత సమయాల్లో ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ సక్రమంగా ఉంటుంది. కేవలం ఆహార నియంత్రణే కాకుండా, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా బిజీ లైఫ్‌స్టైల్ గడిపే ఉద్యోగస్తులు, యువకులు పని ఒత్తిడిలో భోజనం మానేస్తుంటారు. బరువు తగ్గాలనుకునే వారు ఏదైనా ప్రణాళిక రూపొందించుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి