Home
Polambata
Polambata News
-
KCR: ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందించిన కేసీఆర్..
ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానని తెలిపారు. పదేళ్ళపాటు సీఎంగా ఉన్నాను... కచ్చితంగా క్లారిటీ ఇస్తానని కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో చిట్ చాట్ లో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతానని కేసీఆర్ పేర్కొన్నారు. -
Medipalli Satyam: అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోలేదు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట కార్యక్రమంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోలేదని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయన ఒక్క రైతును పరామర్శించలేదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైలుకి పంపించిన ఘనత కేసీఆర్ సర్కార్ కే దక్కిందని విమర్శించారు. -
KCR: కేసీఆర్ బయలుదేరాడు ఇక ఆగడు.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతా
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వాలని అంటే.. ఓ కాంగ్రెస్ మంత్రి నిరోధ్లు, పాపడాలు అమ్ముకుని బతకమని అంటున్నారని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులు నిరోధ్లు అమ్ముకోవాలా కుక్కల కొడుకుల్లారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తామేమి రనౌట్ కాలేదు.. తమకంటే కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. ఆ ఒకటిన్నర శాతం ఓట్లు కూడా తులం బంగారం, ఆరు… -
KCR: ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు, అబద్ధాలు..
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు.. అబద్ధాలు.. ఒక్క హామీ నెరవేరలేదని తెలిపారు. అసమర్థులు, చవట దద్దమ్మలు పాలనలో ఉన్నారు కాబట్టి ఈ స్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో… -
KCR: కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ ‘పొలంబాట’..
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా.. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా.. ముగ్ధుంపురంలో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై కేసీఆర్ ఆరా తీశారు. అయితే.. సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని రైతులు కేసీఆర్ కు తెలిపారు. గతేడాది నీరు సమృద్ధిగా ఉండేదని.. ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని…
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!