పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన పై కేసీఆర్ మౌనంగా ఉన్నారని కవిత తన లేఖలో స్పష్టం చేసిందని చెప్పారు. పదేండ్లు దోచుకున్న సంపదలో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ ఏర్పడిందని సంచలన ఆరోపణలు చేశారు.. పదేండ్లు కవిత ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. ఆస్తుల పంపకాలలో తేడాలు రావడం తో కవితకు ఎస్సీ ఎస్టీ బీసీలు గుర్తుకు వచ్చారని తీవ్రంగా విమర్శించారు..
READ MORE: Mysore Pak: ‘‘పాక్’’ ఉందని ‘‘మైసూర్ పాక్’’ పేరు మార్చేశారు.. కొత్త పేరు ఏంటంటే..
ఎస్సీ, ఎస్టీ, బీసీలను కేసీఆర్ పార్టీ నుంచి బయటికి పంపినప్పుడు కవితకు గుర్తుకు రాలేదా? అని విప్ బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. పార్టీ నుంచి బయటకు పంపుతారన్న భయంతోనే కవిత ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు.. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని బయట పెట్టినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందని… పార్లమెంట్ ఎన్నికల ముందే కవిత ఈ విషయాన్ని బయట పెడితే బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కావన్నారు.. పదేండ్లు కేసీఆర్ ఫాం హౌజ్ నుంచి పాలన చేస్తుంటే కవిత ఎందుకు మాట్లాడలేదు..? అని ప్రశ్నించారు. జనాలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే పట్టించుకోకుండా కేసీఆర్ ఫాం హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కవిత లేఖ పైన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. హరీష్ రావు బీజేపీలోకి పోతుంటే కేటీఆర్ ఆయన కాళ్ళు పట్టుకున్నారని మీడియాలో వస్తే చూశానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని నమ్మితే కేటీఆర్ సీబీఐ విచారణ కోరాలని సూచించారు. కాళేశ్వరం పైన సీబీఐ విచారణ కోరుతు బీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి లేఖ రాయాలని స్పష్టం చేశారు..
READ MORE: Gautam Gambhir: ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు.. గంభీర్‌కు ఊహించని షాక్..!
మేడిగడ్డలో కాంగ్రెస్ వాళ్లు బాంబు పెట్టారని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీర్ల ఐలయ్య మండిపడ్డారు.. “కేటీఆర్ మైండ్ దొబ్బినట్లు కనిపిస్తోంది.. మేము బాంబులు ఎందుకు పెడతాము. డబ్బు మదంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. మా సీఎం మీద కేటీఆర్ అవాకులు చెవాకులు పేలితే మా కార్యకర్తలు బట్టలు ఇప్పించి రోడ్డు మీద కొడతారు.. హరీష్ రావు ఆరు అడుగులు ఉన్నాడు కానీ దామాక్ లేదు. కవిత కేసీఆర్ తప్పులు జనాలకు మీరు చెప్పినందుకు తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారు.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. బీఆర్ఎస్ గురించి ఆలోచించే సమయం మా ముఖ్యమంత్రికి లేదు..” అని ఆయన వ్యాఖ్యానించారు.
