పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో బాంబులు పెట్టారని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ అడుగుతున్నట్టు కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా ములకనూరులో మంత్రి మాట్లాడారు.
Kadiyam Srihari : జనగామ జిల్లా యశ్వంతపూర్ శివారులోని శ్రీ సత్య సాయి కన్వెన్షన్ హాల్‌లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల అధికార కాలంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఆస్తులు సంపాదించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో…
ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్ కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు ఆది శ్రీనివాస్.