తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తారీకు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని.. వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజలను మోసం దగా చేశారని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి…
పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..